– ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య
విశ్వం క్రమబద్ధంగా ఉంది. కాబట్టి దాని గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయవచ్చును.
(The Universe is Regular and is hence predictable)
విశ్వం అనుక్షణం మారుతూనే ఉంది. ఆ మార్పులో క్రమత్వం ఉంది. కాబట్టి దాని గురించి పరిశోధించి నిజాలు తెలుసుకునే ఆస్కారం ఉంది.
ఏ నియమ నిబంధనలు లేనట్లయితే విశ్వంలో దేన్ని గురించి తెలుసుకోవడం వీలు కాదు. విజ్ఞాన శాస్త్ర సారమంతా విశ్వపు సౌష్టవత్వాన్ని గురించి పూర్తి సమాచారం రాబట్టాలనే ప్రయత్నమే! తద్వారా మానవుడి జీవనస్థితిగతులను మెరుగుపరచాలి అనుకోవడమే! తద్వారా మానవుడి జీవనస్థితిగతుల్ని మెరుగుపరచాలని కోవడమే! ఉదాహరణకు ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అనుకుందాం. ఉదయం 10 గంటల సమయంలో అది ఫలానా చోట ఉన్నట్టుగా నీవు గమనిస్తే అది క్రమ వేగంతో వెళుతోంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటలప్పుడు అది 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిని చేరుతుందని మనం అంచనా వేయవచ్చును. ఇదేవిధంగా విశ్వానికి, విశ్వంలో జరిగే పలు సహజ సంఘటనలోనూ కూడా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ఆధారంగానే విశ్వం 1500 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ ద్వారా నేడున్న విశ్వరూపం లో పుట్టిందని, అది క్రమేపీ విస్తరిస్తూ అన్ని వైపులకు సమానమైన విధంగా వెళుతోందని తెలుస్తోంది.
విశ్వంలో ఒక పరిశీలకుడు ఎక్కడి నుంచి చూసిన విశ్వం సౌష్టవంగానే ఉంటుంది. తనకు దగ్గరగా ఉన్న వస్తువులు మెల్లగాను, దూరంగా ఉన్న వస్తువులు వేగంగాను విస్తరించుతూ ఉన్నాయి. విశ్వంలోని ప్రదేశం గోళియాకారంలో ఉందని, కాంతి కూడా గురుత్వ ఆకర్షణకు లోనవుతుందని తెలుసుకున్నారు. విశ్వంలోని సౌష్టవం వల్లే ప్రకృతి నియమాలు రెడీ అయ్యాయి. అయితే విశ్వంలో భావి పరిస్థితుల్ని అంచనా వేయగలమే గాని పూర్తి నిర్ధారణతో చెప్పలేమని క్వాంటం సిద్ధాంతం చెప్తోంది. అంచనాలు పెద్ద వస్తువుల్లో చాలా కచ్చితంగాను, పరమాణు స్థాయి వస్తువుల్లో తక్కువ ఖచ్చితంగా ఉంటాయి. ఈ పరిమితి ఉన్న అంచనా వేయగలగడానికి కారణం విశ్వంలోని క్రమత్వమే. క్రమత్వమే లేని విశ్వంలో సైన్సు ఉండేది కాదు. విశ్వం క్రమత్వానికి కారణ పదార్ధ లక్షణంలోని క్రమత్వమే.
మనం ‘బొమ్మ బొరుసా’ ఆడుతూ ఉన్నాం అనుకుందాం. మనం నాణాన్ని పైకి ఎగరేసినప్పుడు బొమ్మ పడుతుందో, బొరుసు పడుతుందో కచ్చితంగా చెప్పలేము. అయితే కొన్ని వేల సార్లు బొమ్మ బొరుసు వేస్తే దాదాపు 50 శాతం బొమ్మ, 50 శాతం సార్లు బొరుసు పడ్డం కచ్చితం. మొత్తం అన్ని బొమ్మలు ఎప్పుడు పడవు ఇది ఒక రకం ఇది ఓ క్రమత్వం.
ఒక పాత్రలో గాలి ఉందనుకుందాం. అందులోని అణువులు ఎటు వెళ్తున్నాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కాబట్టి పాత్రలో కుడివైపు గోడమీద కన్నా ఎడమవైపు గోడమీదికి ఎక్కువసార్లు గాలి అణువుల తాడనాలు ఉండే ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడు కొలిచిన అన్ని గోడల మీద గాలి అణువులు కలిగించే తాడనాలు (ఒత్తిడి లేదా పీడనం) సమానంగా ఉంటాయి. ఇది ఒక క్రమత్వం. పరమాణువులోని ఎలక్ట్రాన్ కనుమ పరమాణువులోని ఎలెక్ట్రాన్, ఎలక్ట్రాను కణమా తరంగమా కచ్చితంగా చెప్పలేం. కానీ నిర్దిష్ట నియంత్రిత పరిస్థితులలో ఎల్లప్పుడూ ఏ అణువులోని పరమాణువులైన ఒక పద్ధతి ప్రకారమే ప్రవర్తిస్తాయి. మైలతుత్తం అనే కాపర్ సల్ఫేట్ (CuSO4) లవణం లో వుండే ఒంటరి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ESR ద్వారా బొమ్మ తీస్తే ఈరోజు ఎలావుంటుందో రేపు కూడా అలానే వుంటుంది. కాబట్టి అంతరాంతరాల్లో కచ్చితంగా లేని వ్యవస్థలు అయినా స్థూల జగత్తులో క్రమత్వానికి దారితీస్తున్నాయి.
విశ్వంలో క్రమత్వం ఆధారంగానే విశ్వావిర్భావాన్ని అంచనా వేస్తున్నారు. గెలాక్సీలలో క్రమత్వాన్ని బట్టి సౌరమండలాన్ని పరిశీలించవచ్చు. సౌరమండలంలోని క్రమత్వాన్ని బట్టి ఏ ఏ రోజుల్లో చుక్కలు వస్తాయో, ఎప్పుడు గ్రహణాలు వస్తాయో కచ్చితంగా తెలుసుకుంటున్నాము. భూమిలోని క్రమత్వం ఆధారంగానే రుతువులు, రేయింబవళ్లు, ఉష్ణోగ్రత వ్యత్యాసాలను అంచనా వేస్తున్నారు. పదార్థాలలో క్రమత్వం ఆధారంగానే ఫలానా వస్తువును ఫలానా పనికి వాడుతున్నారు. బంగారంలో క్రమత్వం లేకుంటే రేపటికి కూడా అది బంగారంగానే ఉంటుందన్న గ్యారెంటీ ఏమిటి?
మానవ శరీరంలో క్రమత్వం లేకుంటే వైద్యుడు నేర్చుకున్న వైద్యం మన మీద పని చేస్తుందన్న గ్యారెంటీ ఉండదు. శవాల్ని కోసి తెలుసుకున్న శరీర నిర్మాణం అందరిలోనూ అదే క్రమంలో ఉంటుంది కాబట్టే వైద్యం చేయగలుగుతున్నారు. పలాని పదార్థాన్ని ఫలానా విధంగా చేస్తే ఫలానా వేరే పదార్థం లభిస్తుందన్నది రసాయనిక శాస్త్ర క్రమత్వం.