ప్రకృతి నియమాలూ- పర్యావరణ రాజకీయాలూ!
తీవ్ర వాతావరణ సంఘటనల సంవత్సరంగా, అత్యంత ఉష్ణోగ్రతల కాలంగా చరిత్రలో నిలిచిపోతూ 2024 మనల్నించి సెలవు తీసుకుంటోంది. ఎప్పుడూ ఎరగని వడగల్పులు, చలిగాల్పులు మనల్నే కాదు శ్రీలంక, మాల్దీవుల్ని కూడా ఈ ఏడాది అతలాకుతలం చేశాయి. మొన్నటికి మొన్న”ఫంగల్” తీరం దాటుతున్నప్పుడు పాండిచ్చేరిలో ఒకేసారి 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది!