శాస్త్ర వికాసం

ప్రాచీన భారత దేశంలో గణిత శాస్త్రం

జవహర్ లాల్ నెహ్రూ ప్రాచీన భారతీయులు ఉన్నత విజ్ఞానవంతులై రూపం లేని వాటిని గురించి కూడా ఎక్కువ ఆలోచించేవారు. కాబట్టి గణిత శాస్త్రంలో కూడా వారెంతో గొప్పవారు. యూరపు అంక బీజ గణితాలను అరబ్బుల నుంచి నేర్చుకొంది. కానీ ఆ అరబ్బులు భారతదేశ నుండి వీటిని నేర్చుకున్నారు. అందువల్లనే ప్రపంచమంతా వాడుకలో ఉన్న అంకెలను అరబ్బీ అంకెలు అంటారు. కానీ ఇప్పుడు అంక బీజగణితాల జన్మస్థలం భారతదేశమేనని అందరూ అంగీకరిస్తున్నారు.