సంపాదకీయం

ఆనందం కరువైన అభివృద్ధి

సంపాదకీయం "ఆనందమె జీవిత మకరందం" అంటాడు సినీ కవి సముద్రాల. ఇంతకూ సదరు ఆనందానికి మూలకందం ఏది? అంతులేని సంపదలా? అఖండ జ్ఞాన విజ్ఞానాలా? శాంతి సామరస్యాలా? స్నేహమయ సామాజిక సంబంధాలా? జనచైతన్యమా? ప్రజానుకూల పాలనా విధానాలా? ఇటీవల విడుదలైన "ప్రపంచ సంతోష నివేదిక" (2025) వీటన్నిటిని తనదైన శైలిలో విశ్లేషించి దేశాలకు ర్యాంకులిస్తుంది. వీటిల్లో కొన్ని మన కళ్ళు తెరిపిస్తాయి. కొన్ని నివ్వెర పరుస్తాయి. కొన్ని ఉసూరుమనిపిస్తాయి. ఈ