యుగంధర్ అది ఊరి బయట ఒక ఇంటిలో ఓ గది. గది గోడల నిండా రకరకాల దేవతల భయంకర రూపంలో ఫోటోలు. గది అంతా దీపపు కాంతితో వెలిగిపోతోంది. అక్కడక్కడ సాంబ్రాణి పొగ లుంగ చుట్టుకుని మెల్లగా వెలువడుతోంది. గది మధ్యలో పెద్ద ముగ్గు. ఆ ముగ్గులో అక్కడక్కడ పూలు, పసుపు కుంకుమలు, పెద్ద పెద్ద నిమ్మకాయలతో అలంకరించబడి ఉంది. ముగ్గు మధ్యలో పిండితో చేయబడి, వికృతంగా కాళ్లు, చేతులు