చరిత్ర ఏమంటుంది

బౌద్ధ జైన చార్వాకుల కాలంలో ప్రోటో సైన్సు 600BC

డా. గేయానంద్ క్రీస్తుపూర్వం 600- 300 మధ్య కాలాన్ని, భారత ఉపఖండంలో ఒక గొప్ప పరివర్తనా కాలంగా భావించవచ్చు. ఉత్తర భారత తొలి చరిత్ర కాలాల ప్రారంభంగా, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాన్ని గుర్తిస్తారు. అది వైదిక యుగం ముగుస్తున్న కాలం. వేద కాలాల నాటి, భావాలను సవాలు చేసిన కాలం. వైజ్ఞానిక ఆలోచనలు, సాంకేతికలు పురోగమించిన కాలం. భారత ఉపఖండ చరిత్రలో విశిష్టమైన కాలం. అదేమిటో చూద్దాం.  ఇనుము తెచ్చిన