ఉద్దాలక అరుణి ఉవాచ! - విటపు బాల సుబ్రహ్మణ్యం "పుత్రా! శ్వేతకేతూ! వచ్చావా నాయనా? పన్నెండేళ్ళ గురుకుల వాసంలో ఎంత పెద్దవాడివైపోయావురా? విద్యాభ్యాసం సంతృప్తిగా పూర్తి చేసావా? ఇరవై నాలుగేళ్లు వచ్చాయి కదా! గురువులు గృహస్థాశ్రమానికి అనుమతించారా?" "తండ్రీ! నాలుగు వేదాలు ఆపోశనం పట్టాను. షడ్దర్శనాలు నా నాలుక మీదే వున్నాయి. 'ఉద్దాలకపుత్రుడు శ్వేతకేతువిప్పుడు సకల శాస్త్ర పారంగతుడు! తండ్రిని మించిన కొడుకు! గురువును మించిన శిష్యుడు!' అని మా గురువులే మెచ్చుకున్నారు!"