సి. వి. కృష్ణయ్య చదువు మానసికమైనది, పిల్లలైనా పెద్దలైనా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటూ తర్కిస్తూ జ్ఞానం సంపాదించుకుంటారు. పిల్లలు సంసిద్ధులుగా ఉన్నారా లేదా అని చూడకుండా ఈ గంటలో ఈ పాఠాన్ని నేర్చుకోవాలని నిర్బంధిస్తే ఏం జరుగుతుంది? ఇందుకు సంబంధించి నా అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు వివరిస్తాను. తొలి సంఘటనఒకరోజు 20 ఏళ్ల యువకుడు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు."నేను మీ స్టూడెంట్ రవిని, గుర్తున్నానా