టి. వి. వెంకటేశ్వరన్ 1892లో ఎర్నెస్ట్ హాన్బరి హన్కిన్స్ అనే సైంటిస్టుని కెమికల్ అనలిస్టుగా, బాక్టీరియాలజిస్టుగా పంజాబ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సులలో పనిచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. అతని ప్రధాన కర్తవ్యం బ్రిటీష్ సైనికుల్ని ప్రాణాంతక వ్యాధులనించి ప్రత్యేకించి కలరా నుంచి కాపాడ్డం. ఢిల్లీలో అతను ప్రతిరోజూ వేలమంది స్థానికులు యమునా నదిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులు కడగడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇతర యూరోపియన్ ఆఫీసర్ల