పిల్లలు-చదువులు

పాఠాలు గుణపాఠాలు

-  సి.వి. కృష్ణయ్య మనం నడిచే దారిలో విలువైన రత్నాలు ఉంటాయి. అవి మామూలుగా రాళ్ళలాగే ఉంటాయి. వాటిని కాళ్లతో తొక్కుకుంటూ నడిచి వెళ్తాం. మన జీవితంలో కూడా రత్నాలు వంటి విలువైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను జాగ్రత్తగా పరిశీలించి చూడగలిగితే అవి మనకు ఎంతో విలువైన పాఠాలుగా మిగిలిపోతాయి. దురదృష్టం ఏమిటంటే దేనిని మనం సీరియస్ గా తీసుకోము. యధాలాపంగా వదిలేస్తాం. దీనివలన చేసిన తప్పునే