శాస్త్ర వికాసం

సామాన్యుడు శాస్త్రజ్ఞుడైన వేళ!

ప్రొ. యశ్ పాల్ అతడో పల్లెటూరి రైతు. అతనికున్నదల్లా ఓ పంపుసెట్టు. అదే అతని ప్రాణం, జీవనాధారం. దాని అంగాంగమూ అతనికి తెలుసు. దాని ప్రతి కదలికా అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. అప్పుడప్పుడూ అది మొరాయిస్తుంది. అయితేనేం? దాన్ని బుజ్జగించి (మరమ్మత్తు చేసి) దారిలో పెట్టుకోవడం అతనికి చిటికెలోపని! ఆ రైతు కొడుక్కి పదేళ్లు. వాడికి ఈ పంపుసెట్టు పని అంటే మహా సరదా. జుగాడ్ ఇలా పుట్టిందిఒకరోజు మన