శాస్త్రజ్ఞులు

దేశవాళీ రసాయన శాస్త్ర పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి సాధించిన త్యాగధనుడు – ఆచార్య ప్రపుల్ల చంద్ర రే

డా. నాగసూరి వేణుగోపాల్ అది బ్రిటిష్ వారు పాలించే కాలపు భారతదేశ రాజధాని కలకత్తా పట్టణం. ఆ యువకుడు రసాయన శాస్త్ర అధ్యాపకుడు. ఆయన ఇల్లే ఒక చిన్న ప్రయోగశాల. పరిశోధనల కోసం పశువుల ఎముకలు సేకరించి ప్రయోగశాలలో పోగు చేశాడు. ఎముకల వాసన ప్రయోగశాలకే పరిమితం కాక, ఆ వీధి అంతా గుప్పుమంది! అంతేకాదు, కాకులు బారులుగా వాలి, వీధి అంతా పచార్లు కొడుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం