ప్రకృతి-పర్యావరణం

పర్యావరణ పరిరక్షణ – తాజా నాటకం

- ప్రొ. యన్. వేణుగోపాల రావు ఐక్యరాజ్యసమితి "కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్" 28వ చర్చా వేదిక దుబాయ్ నగరంలో 2023 నవంబరు 30 నుండి డిసెంబరు 13 దాకా జరిగింది. ఇలాంటి' గెట్ టుగెదర్లు' గత మూడు దశాబ్దాల్లో వివిధ నగరాల్లో జరుగుతూనే వున్నాయి. తీర్మానాలు చేస్తూనే వున్నారు. గతంలో జరిగిన క్యోటో ( 1997), పారిస్( 2017) ఒప్పందాలు మనల్ని చాలా ఊరించాయి. కానీ ధనిక దేశాలు మాత్రం