పిల్లలు-చదువులు

అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది?

సి.వి.కృష్ణయ్య అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది? కొంప కొల్లేరవుతుంది. చేసిన కష్టమంతా వ్యర్థమవుతుంది. వల్లెవేత చదువుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూస్తున్నాం గదా. ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎక్కడ వుందో అర్థం కావడం లేదా? ఇప్పటివరకు మనకు వచ్చిన నోబుల్ అవార్డులు ఎన్ని? మనం ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేశాము? ప్రతి ఏటా మనం సంపాదిస్తున్న పేటెంట్లు ఎన్ని? ప్రపంచ దేశాల్లో మన విశ్వవిద్యాలయాల స్థానం ఎక్కడ?