విద్యారంగం – జెన్ జీ పాఠం
సంపాదకీయం ఇటీవల ఎప్పుడూ లేనట్టు మన సమాజం ఎటు పోతోందన్న భయం మనకు పట్టుకుంది. ఆర్థిక సంక్షోభం గురించీ, నిరుద్యోగం గురించీ ఒకవైపూ ; రాజ్యాంగ విలువలకూ, మానవ విలువలకూ గ్రహణం పట్టడం గురించి మరోవైపూ ఏ నాడూ ఎరగని ఆందోళన మొదలైంది. పెరుగుతున్న సామాజిక అంతరాల గురించి తీవ్రంగా ఆందోళన పడుతున్న కాలం మనది. నానాటికీ శాస్త్రీయ దృక్పథం కొరవడుతోందనీ, ఛాందసం ముదురుతోందనీ బాధపడుతున్న రోజులు మనవి. నిజమే
