సంపాదకీయం

ఇంకా నరబలులా?

కొన్ని వార్తలు వింటుంటే మనం ఆదిమ బర్బర యుగాల్లోంచి ఇంకా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నామా అనిపిస్తుంది. అలాంటి వార్తల్లో ఒకటి ' 2014 -21 మధ్య 103 నరబలులు జరిగా'యన్న వార్త! సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ "జాతీయ నేర రికార్డు బ్యూరో" (NCRB) బయటపెట్టిన వాస్తవమిది. అంతే కాదు 2022లో కూడా ఇలాంటివి ఆరు జరిగాయట! ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (26 అక్టోబరు 2024) తాజా కథనమిది.