చరిత్ర ఏమంటుంది

ఆస్ట్రానమీకి డార్విన్! సైన్స్ ఉద్యమానికి డార్లింగ్! మేఘనాథ్ సాహా !

డా. యం. గేయానంద్ శాస్త్రవేత్తలంటే ప్రయోగశాలలకు పరిమితమై వుంటారు. కానీ మన దేశంలో పుట్టిన ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేశాభివృద్ధికోసం తనదైన ఆలోచనలతో జీవితపు చివరి ఘడియ దాకా భాగస్వామి అయ్యాడు. ఇలాంటి అరుదైన భారతీయ మేధావి మేఘనాధ్ సాహా! 1854 అక్టోబర్ 6న ఆయన ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా కష్టాలమయం. తండ్రి పేదరికం వల్ల చదివించడానికి సిద్ధంగా లేడు.