శాస్త్ర వికాసం

భారతీయ అంతరిక్ష స్వప్నాలకు తొలి మెట్టు ఆర్యభట!

రవి రాజా పోతినేని అది 1975 ఏప్రిల్ 19 తెల్లవారుజాము. కాస్పియన్ సముద్రానికి ఉత్తరాన ఉన్న సోవియట్ అంతరిక్ష కేంద్రపు కపుస్టిన్ యార్ ప్రయోగస్థల వాతావరణమంతా ఉత్కంఠతో నిండిపోయివుంది. భారత ఇంజనీర్లు సోవియట్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. చుట్టూ ఉద్వేగభరిత నిరీక్షణ ఆవరించి వుంది. పురాతన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట పేరు మీద భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని కాస్మోస్ 3-ఎం ప్రయోగ వాహనం సాయంతో అంతరిక్షంలోకి