పురాణగాధా శోధనలో తరిస్తున్న పురాతత్వ శాఖ
సంపాదకీయం రంగస్థలం పైకి మహాభారత సీరియల్ యోధుడి గెటప్ తో నటుడు మనోజ్ బాజ్ పాయి స్వగతంలో భారత యుద్ధవీరుల్ని మననం చేసుకుంటూ ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడి, కర్ణుడి రథాల్ని కీర్తిస్తూ నేపథ్యగానం వీనులవిందు చేస్తుంది. ఇంతలో గ్రాఫిక్స్ మాయాజాలం మధ్య రెండు చక్రాల గుర్రాల రథం సాక్షాత్కరిస్తుంది. అది కొయ్యదే గానీ చక్రాలతో సహా మొత్తం రాగి రేకుల తాపడంతో ధగధగలాడుతుంటుంది. ఓ నిమిషం తర్వాత రంగురంగుల ఫ్లడ్ లైట్ల
