శాస్త్ర ప్రచారం

మనిషికి కోతికీ మధ్య ‘మిస్సింగ్ లింకు’ కోసం…

 డా.విరించి విరివింటి మనిషి తాను జీవించే జీవితానికి ఒక సార్థకతను సాధించాలనుకునే జీవి. Frontal cortex ( మెదడు ముందరి భాగం.ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు ఇక్కడే జరుగుతాయి. ) అభివృద్ధి చెందిన మనిషి జ్ఞానం(cognition) లోనే ఈ "సార్థకత" భావన స్థిరపడి ఉంది‌. తన జీవితానికి సార్థకత ఉండాలనుకున్నందుకే దానిని సాధించడానికి ఒక క్రమత్వం (Pattern) కోసం అన్వేషణ మొదలవుతుంది‌. అందుకే మనిషిని క్రమత్వం కోరే జంతువు