ఆడపిల్ల మన ఆశ, మన భవిష్యత్తు - విటపు బాలసుబ్రమణ్యం "భారతదేశంలోని నేటి అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి ఏమంటే ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకుని ఉదయం బడికి బయలుదేరడం". ఏ విద్యాభిమానో భావోద్వేగంతో చెప్పిన మాటలు కావివి. న్యాయశాస్త్రాన్ని కాచి వడపోసిన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పులోని వాక్యమిది! ఈ స్పృహ మనలో ఎంత మందికి వుంది? మన విద్యారంగ పాలసీల నిర్ణేతలకు, ప్రభుత్వాలకు, సామాజిక ఉద్యమకారులకు, మేధావులకు మాత్రం ఏ