విజ్ఞాన శాస్త్రం- వికృత ధోరణులు
విజ్ఞాన శాస్త్రం రుజువులతో వాస్తవాల్ని బయటపెట్టాలి. సత్యాన్ని పరమధర్మంగా భావించాలి. సంకుచిత ధోరణి నుంచి మళ్లించి సమాజానికి విశాల దృక్పథం కలిగించాలి. విశ్వమానవత్వం దాని అంతిమలక్ష్యంగా వుండాలి. దాని పరిశోధనల్లో, సూత్రీకరణల్లో స్వీయ మానసికతకు, స్వార్ధపర శక్తుల ప్రయోజనాలకు తావుండరాదు. అధిపత్య వర్గాల చేతుల్లో పావుగా మారి, సైన్సు పేర వారి చేతికి కొత్త పరికరాలు అందించరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సు నుంచి మనం సత్యాన్ని ఆశిస్తాం. శాస్త్రవేత్తలు
