సమాచారం

జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం!

ఆగస్టు 20 జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం! ఆగస్టు 20, డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ను మతఛాందసశక్తులు  కిరాతకంగా బలిగొన్నదినం. సైన్సు కోసం, శాస్త్రీయ ఆలోచనల కోసం ఒక యోధుడు బలిదానం చేయాల్సి రావటం స్వతంత్ర భారత చరిత్రలో సిగ్గుతో తలవంచుకోవలసిన దినం. మరోవైపు ఆధునిక దృక్పథం కోసం తపించే శక్తులందరికీ ఇది ఒక దీక్షాదినం కూడా. దబోల్కర్ ఉసురు తీసిన శక్తులే ఆ తరువాత డాక్టర్ గోవింద పన్సారేని,