సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు.. - డాక్టర్ గేయానంద్ 18వ శతాబ్దం, విప్లవాల కాలం. మేధావులు మామూలు మనుషులు కలిసిమెలిసి మాట్లాడుకున్న కాలం. సంఘాలుగా ఏర్పడిన కాలం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చుట్టూ మొట్టమొదటిసారిగా సంఘాలు ఏర్పడిన కాలం ఆదే. అట్లా ఏర్పడిందే లూనార్ సొసైటీ. ఇంగ్లాండ్ లో1765-1813 మధ్యకాలంలో ఈ సొసైటీ చురుగ్గా ఉండేది. అందులో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆలోచన పరులూ ఉండేవారు. నెలకు ఒకసారి, పున్నమికి దగ్గరలో