విఠపు బాల సుబ్రహ్మణ్యం దొరస్వామికి ఏదో అయింది. అతడికి ఆడపిల్ల లాగా పావడ, రవిక తొడుక్కోవాలనిపిస్తోంది. పూలు పెట్టుకోవాలని కోరికగా వుంది. పచ్చటి పొలంలో పనిచేసేప్పుడు ఆడపిల్లల్లా ఊహించుకుంటూ పాటల పాడాలనిపిస్తోంది. ఏడో తరగతిలో చంద్రమతి వేషం వేసినప్పుడు పట్టరాని సంతోషం వేసింది .తాను అబ్బాయి అయినా మగ పిల్లల్ని ప్రేమించాలని ఉబలాటంగా వుంది. అదొక స్వభావం! మగ, ఆడ పిల్లల లాగే ఇలాంటి వాళ్ళూ ప్రకృతిలో వున్నారు. అక్షరాలా