ప్రొఫెసర్ A. రామచంద్రయ్య

పదమూడవ సార్వత్రిక నియమం
పరమాణువులు ఎలక్ట్రాను మేఘాలతోనే సంధానించుకొని
అణువుల్నీ సంయోగ పదార్ధాల్నీ ఏర్పరుస్తాయి.
(Atoms are Bound Together by electron clouds to form molecules and compounds)

మనం రెండు కాగితాల్ని అంటించడానికి బంక (గమ్ము, జిగురు) వాడతాము. ఆ రెండు కాగితాల మధ్య జిగురు సంధానకర్తగా వ్యవహరిస్తుంది. గోడకట్టేటప్పుడు ఇటుకల మధ్య సిమెంటు పెడతారు. సిమెంటు సంధానకర్తగా వ్యవహరించడం వల్లే ఆ రెండు లేదా అంత కన్నా ఎక్కువ ఇటుకలు కలిసి కట్టుగా ఉంటున్నాయి. అలాగే పదార్ధాలన్నీ పరమాణు సముదాయాలే.

ఘన, ద్రవ, మూలకాలలోనూ ప్రతి సంయోగ పదార్థ అణువులలోనూ ఉన్న పరమాణువుల మధ్య వివిధ అణువుల మధ్యలోనూ బంధాలను ఏర్పరిచి అనుసంధానం చేసేది ఆయా పరమాణువులలో ఉండే ఎలక్ట్రాన్లే! ఎలక్ట్రాన్లు అనే గొలుసు చేత బంధింపబడ్డ రెండు పరమాణువుల మధ్య ఉన్న బంధాన్ని రసాయనిక బంధం (Chemical Bond) అంటారు. అణువుల మధ్య కూడా బలమైన లేదా బలహీనమైన రసాయనిక బంధాలు ఉండవచ్చును. మొత్తంమ్మీద అవి ఎక్కడున్నా ఒక పరమాణువును మరో పరమాణువుతో బంధించి ఉంచగలిగే సామర్థ్యం పరమాణువులోని ఎలక్ట్రాన్లదే!

ఈ సార్వత్రిక సూత్రం  కూడా ఆత్మ, గతజన్మ, పూర్వజన్మ అనే అశాస్త్రీయ, ఛాందస భావాలను త్యజిస్తుంది. దయ్యాలు, భూతాలు, ఆత్మల్లో ఏ పదార్థం వుందో, ఆ పదార్ధాలలోని పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయో, అవెలా సంధానించుకున్నాయో చెప్పగలరా! జీవకణంలో జరిగే చర్యలన్నీ రసాయనిక బంధాలను తెంచడం, కొత్త బంధాలను ఏర్పర్చడమే! రసాయనిక చర్యల్లో తంతు కూడా అదే!

ఓ ఉదాహరణను తీసుకొందాం. బొగ్గు ఎందుకు మండుతుంది? బొగ్గు మూలకమని మనకు తెలుసు. బొగ్గులో కార్బన్ (C) పరమాణువులు ఒక క్రమపద్ధతిలో పరస్పరం ఎలక్ట్రాన్ల సహాయంతో బంధించుకుని C-C-C రూపంలో అన్ని వైపులకు విస్తరించి ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్ పరమాణువులుంటాయి

(O=O). ఆ బంధానికి కారణం ఆక్సిజన్ పరమాణువుని ఎలక్ట్రాన్లే! ఇపుడు కార్బన్ (బొగ్గు) ను మండించినపుడు (C-C) బంధాల్లో ల్గొన్న ఎలక్ట్రాన్లు O₂ బంధాల్లో పాల్గొన్న ఎలక్ట్రాన్లు అటూ ఇటూ సర్దుబాటు చేసుకొని O= C=O అనే విధంగా బంధాలుగా అమరుతాయి. ఇక్కడ (O=C) మధ్య ఉన్న బంధంలో కూడా ఎలక్ట్రాన్లున్నాయి. అయితే ఇందులో కార్బన్ నుంచి వచ్చిన ఎలెక్ట్రాన్లు ఆక్సిజన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్లు సంయుక్తంగా ఉంటాయి. వివిధ పరమాణువుల మధ్య బంధాలను ఏర్పరిచేవి ఆయా పరమాణువులలోని ఎలక్ట్రానులు మాత్రమే! ఎలక్ట్రాన్లు లేకుండా పరమాణువుల్ని బంధించలేము. ఎలక్ట్రాన్ల మేఘాలు పరమాణువుల మధ్య, అణువుల మధ్య బంధాలను ఏర్పరిచే తీరుతెన్నులను బట్టి పలు రకాల రసాయనిక  బంధాలు ఏర్పడుతాయి. ఇందులో ఆయానిక్ బంధాలు, సమయోజనీయ (covenant) బంధాలు, హైడ్రోజన్ బంధాలు,  పై (ఫై) బంధాలు, వండర్ వాల్ బంధాలు , అరటి బంధాలు (Banana Bonds) ముఖ్యమైనవి.

సార్వత్రిక నియమంగా చెప్పాలంటే పదార్ధాలలోని పరమాణువుల్ని అణువుల్ని సంధానించే గుణం ఎలక్ట్రానులతో కాకుండా మరే ఇతర పద్ధతుల్లో పరమాణువులు లంకె వేసుకోలేవు.

One thought on “పరమాణువులు ఎలక్ట్రాను మేఘాలతోనే సంధానించుకొని అణువుల్నీ సంయోగ పదార్ధాల్నీ ఏర్పరుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *