సత్యంసత్యం అధిక సంఖ్యాకుల గుత్తాధిపత్యం కానక్కర్లేదు!అల్ప సంఖ్యాకులు కూడా ప్రపంచంలో ఎన్నో సత్యాల్ని వెలికితీసారు!!అందరూ అంగీకరించిన తర్వాతే సత్యం నిర్ధారణ కావడమనేది ఎప్పుడూ జరుగదు!!!- ఆచార్య సచ్చిదానంద మూర్తి
ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని గుడ్డిగా నమ్ముతారు. -మహాకవి కాళిదాసు
ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు! జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు!! జీవితంలోని ప్రతి కోణాన్ని చూపలేనిది సాహిత్యమే కాదు !!- కొడవటిగంటి కుటుంబరావు