సత్యం సత్యం అధిక సంఖ్యాకుల గుత్తాధిపత్యం కానక్కర్లేదు! అల్ప సంఖ్యాకులు కూడా ప్రపంచంలో ఎన్నో సత్యాల్ని వెలికితీసారు!! అందరూ అంగీకరించిన తర్వాతే సత్యం నిర్ధారణ కావడమనేది ఎప్పుడూ జరుగదు!!! – ఆచార్య సచ్చిదానంద మూర్తి
ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని గుడ్డిగా నమ్ముతారు. -మహాకవి కాళిదాసు
మన విద్యా శిక్షణాసంస్థలు! మన విద్యా శిక్షణాసంస్థలు!స్వతంత్రంగా వ్యవహరించే వారినీ,స్వేచ్ఛగా ఆలోచించే వారినీ,విధేయతను పాటించని వారినీజల్లెడ పట్టి దూరంగా నెట్టడమేమొత్తం మన విద్యా శిక్షణాసంస్థలు చేస్తున్న పని.ఎందుకంటే వీరున్నంతకాలం ఇవి పనిచెయ్యలేవు మరి! -నోమ్ చోమ్స్కీ
ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తాను అబద్ధాలు చెపుతూ పిల్లల్ని సత్యం పలకమనడం వృథా! తాను పిరికితనం పులుము కొని పిల్లల్ని సాహసవంతులుగా తీర్చాలనుకోడం అసాధ్యం!! తనకు ఆత్మనిగ్రహం లేకండా పిల్లలకు ఆత్మనిగ్రహాన్నిఅలవర్చడం అసంభవం!!! - మహాత్మాగాంధీ