20-05-2025 ఉదయం ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, విశ్వోద్భవ శాస్త్రవేత్త, సైన్సు కమ్యూనికేటర్, రచయిత, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, కళింగ ప్రైజ్ గ్రహీత, గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ తన 87 వ ఏట పూణేలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
వారు మూఢనమ్మక వ్యతిరేక ప్రచారాలలో చురుకుగా పాల్గొన్నారు. సుడో సైన్సు ను నిరంతరం సవాలు చేసారు. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేసారు మరియు అశాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించినందుకు అధికారంలో ఉన్నవారిని బాధ్యులుగా చేసిన అరుదైన ప్రజా మేధావి. వారి మరణం ప్రజసైన్స్ ఉద్యమానికి తీవ్ర లోటు, జనవిజ్ఞానం ఆన్లైన్ పత్రిక వారికి ఘన నివాళి అర్పిస్తుంది.