చెరెన్‌కోవ్ కాంతి నుంచి ఐస్‌క్యూబ్ వరకు: హాల్జెన్ నోబెల్ బహుమతి వెనుక శాస్త్రీయ ప్రయాణం
టి. వి. వెంకటేశ్వరన్ న్యూట్రినోలు భూమిని దాదాపు ఎలాంటి అడ్డంకీ లేకుండా దాటిపోతాయి. వాటిని గుర్తించడానికి తరతరాల శాస్త్రవేత్తల కృషి, సముద్రంలో విఫలమైన ఒక ప్రయోగం, సైబీరియాలోని సరస్సు, చివరకు అంటార్కిటికా మంచు ఎలా ఉపయోగపడ్డాయన్నదే ఈ కథ. అక్టోబర్ 6న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక ప్రకటన చేసింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణంలో, అంతరిక్షం నుంచి వచ్చే అత్యధిక శక్తిగల న్యూట్రినోలను కనుగొనడంలో కీలక
