శాస్త్ర ప్రచారం

సైన్సు, సాంకేతికత,  ప్రజాస్వామ్యం

ఎం. పి. పరమేశ్వరన్ మానవ పరిణామ క్రమం ప్రారంభ దశల్లో విజ్ఞానశాస్త్రాన్ని సాంకేతికత నుంచి వేరుచేయడం సాధ్యమయ్యేది కాదు. అంతేకాదు, విజ్ఞానశాస్త్రం–సాంకేతికతలను నిత్యజీవిత కార్యకలాపాల నుంచి కూడా విడదీయలేం. రాళ్లను పనిముట్లుగా ఎంచుకోవడం, వాటిని అవసరానికి అనుగుణంగా మలచడం వంటి చర్యలకు పదార్థాల కాఠిన్యం, మెత్తదనం, బలం, పెళుసుదనం, దృఢత్వం మొదలైన లక్షణాలపై అవగాహన అవసరమయ్యేది. విల్లు తయారు చేయడానికి స్థితిస్థాపకత గురించి అవగాహన అవసరమైతే, పరుగెడుతున్న జంతువుపై బాణం