కాలంతో పరుగెడుతున్న అద్భుత యంత్రం ‘వాయేజర్-1’!
డాక్టర్ రవి రాజా పొతినేని పరిచయం:1977వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ లాంచ్ ప్యాడ్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి నాసా (NASA) ఒక అద్భుతమైన వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమైంది. అదే వాయేజర్-1 (Voyager 1). అప్పట్లో ఎవరికీ ఊహించని విధంగా, ఈ చిన్న యంత్రం కేవలం కొన్ని గ్రహాలను చుట్టి రావడమే కాకుండా, మానవ చరిత్రే
