సంపాదకీయం

ద్రవిడచైతన్యానికి సైన్సు వత్తాసు

సంపాదకీయం మానవులకు తమ మూలాలు శోధించుకోడమంటే మహా ముచ్చట. తమ పురావైభవాన్ని తవ్వితీసి కథలు కథలుగా చెప్పుకోడమంటే చెప్పలేని వ్యామోహం. ఇందుకోసం ఎవరి పురాణాల్ని వాళ్ళు సృష్టించుకుంటారు. ఎవరి మూల పురుషుల్ని వాళ్లు వెతుక్కొంటారు. ఇక్కడితో ఆగక తమ గతం అనన్యసాధ్యమన్న గొప్పలకు పోతుంటారు. తమది స్వచ్ఛమైన, సర్వోన్నతమైన జాతిగా భ్రమపడుతుంటారు. దీనికోసం గొడవలు పడుతుంటారు. గొంతులు కూడా కోసుకుంటారు. ఇది జాత్యహంకారం. ఫాసిజానికి పూర్వరూపం. వాస్తవానికి జాతిని నిర్ధారించేందుకు