పర్యావరణోద్యమాలకు ప్రాతఃస్మరణీయుడు సుందర్లాల్ బహుగుణ
డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-13 1981లో నైరోబీ నగరంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా, కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసుకుని సమావేశమందిరంలోకి ప్రవేశించడం ఎందరినో ఆకర్షించింది! అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్లాల్ బహుగుణ ప్రయత్నం!! 1927 జనవరి 9న టెహ్రి (ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రపు జిల్లా) ప్రాంతం
