మాతృస్వామ్యవాదనలు : మూలాలు, గమనం – 2వ భాగం
డా. విరించి విరివింటి గత సంచిక కొనసాగింపు.. చరిత్ర పూర్వదశలో మాతృస్వామ్యం అనే ఒక ఆదర్శవంతమైన సమాజం నిజంగా ఉండేదని, ఆ మాతృస్వామ్యం అంతరించిపోయిన తర్వాత లేదా పురుషులు దాన్ని నాశనం చేసిన తర్వాత పితృస్వామ్యం మొదలైందని స్త్రీవాద చర్చల్లోనూ, ప్రగతిశీల మేధావి వర్గాల్లోనూ ఒక అభిప్రాయం/వాదన ప్రాచుర్యంలో ఉంది. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక పుస్తకంపై ఇటీవల జరిగిన ఒక చర్చలో, మాతృస్వామ్య
