జెవివి కొత్త ప్రయత్నం “జన విజ్ఞానం”
మీ ముందున్న ఈ “జనవిజ్ఞానం” శాస్త్ర ప్రచార రంగంలో మేము చేస్తున్న మరో ప్రయత్నం. సైన్సును ఒక సామాజిక చర్యగా, సామాజిక మార్పుకు ఒక ప్రేరకంగా నమ్ముతూ “జన విజ్ఞాన వేదిక” గత నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో కేవలం వైజ్ఞానికాంశాల పైనే గాక , మన చుట్టూ ఉన్న విద్య, ఆరోగ్యం, పర్యావరణం ,చరిత్ర తదితర అంశాలన్నిటిపైనా శాస్త్రీయ దృష్టితో నిరంతర చర్చ జరగాలని కోరుతూ మేమీ ప్రయత్నానికి పూనుకున్నాము. ప్రస్తుతానికిది అంతర్జాల పత్రికగా (పోర్టల్) మాత్రమే వుంటుంది .
తెలుగునాట ఆధునిక దృక్పథం కోసం పనిచేస్తున్న శాస్త్ర సామాజిక ఉద్యమ మిత్రులందరినీ తమ అభిప్రాయాలతో, సూచనలతో, రచనలతో సహకరించి దీన్ని వీలున్నంత సమర్థవంతంగా తెచ్చేందుకు తోడు నిలవాలని కోరుతున్నాము .
రచనలు, అభిప్రాయాలు jvonlinemag@gmail.com లకు పంపగోరుతాము.