శ్వేతకుబ్జ తారలు: సూర్యుడి చివరి మజిలీ
రవి రాజా పోతినేని రాత్రివేళ ప్రశాంతంగా ఆకాశాన్ని చూస్తే నక్షత్రాల వెలుగు శాశ్వతమేమో అనిపిస్తుంది. కోట్ల సంవత్సరాలుగా అవి అలాగే వెలుగుతున్నాయనే భావన కలుగుతుంది. కానీ విశ్వంలో ఏ నక్షత్రమూ శాశ్వతం కాదు. ప్రతి నక్షత్రానికీ పుట్టుక, పరిణామం, చివరకు ఒక అంతిమ దశ ఉంటాయి. మన సూర్యుడి వంటి మధ్యస్థాయి నక్షత్రాలు తమ సుదీర్ఘ జీవితాన్ని ముగించిన తర్వాత మిగిలే అత్యంత వేడి, సాంద్రమైన నక్షత్ర అవశేషాన్ని ‘శ్వేతకుబ్జ
