శాస్త్రజ్ఞులు

భూసారానికి రసాయన భాష్యం చెప్పిన ఆధునిక భారతీయ భౌతిక రసాయన శాస్త్ర మూలపురుషుడు నీల్ రతన్ ధర్

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 18 అది 1912 జనవరి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలోని రసాయనశాస్త్ర శాఖాధ్యక్షులు ప్రపుల్ల చంద్ర రే చాలా రకాల నైట్రైట్లు తయారు చేశారు; లండన్ వెళ్ళి ఈ నైట్రైట్ల ధర్మాలు కనుక్కోవాలని తలంచారు. అయితే ఆ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్సీ. విద్యార్థులలో ఒక చాకులాంటి కుర్రాడు మీరు లండన్ వెళ్ళక్కరలేదనీ, తమ ప్రెసిడెన్సీ కళాశాలలోనే వాటి భౌతిక ధర్మాలు నిర్ణయిస్తానని గురువుకు